SDPT: చిన్నకోడూర్ మండల పరిధిలోని రామంచ ప్రాథమిక పాఠశాలను జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం పద్మారెడ్డి, నాగేందర్, లక్ష్మీ నారాయణ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల మోడల్ లెసన్స్, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.