JN: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని, రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై నిరసన తెలుపుతున్న రైతులను కేటీఆర్ మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి నిరసనకు మద్దతు తెలిపారు. రైతులకు BRS పార్టీ అండగా ఉంటుందన్నారు.