ఖైరతాబాద్ వినాయకుడికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 20 కేజీల లడ్డూ ప్రసాదంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన హిందూ సమాజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూ సమాజం చిలీపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భాగ్యనగర్ లో అతి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, దశాబ్దాలుగా మహా గణపతిని ప్రతిష్టిస్తూ ధార్మిక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
ఆ రోజు బ్రిటీష్ వారిని తరిమి కొట్టడానికి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారని, ఇప్పుడు కూడా కులాలు, మతాలకు అతీతంగా సంఘటితం కావాలన్నారు. హిందూ సమాజాన్ని కులాలు, వర్గాలు, వర్ణాలు, సంఘాల పేరుతో చీల్చే ప్రమాదం నుండి తప్పించి హిందూ సమాజాన్ని సంఘటితంగా మార్చడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
సహజీవనం సమాజాన్ని పీడిస్తున్న ఓ ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరవీర్ సింగ్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రేమ వివాహాల్లో ఎక్కువ విడాకులు అవుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.