BDK: రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్‌లో మరో కీలక ముందడుగు పడింది. రామగుండం–మణుగూరు మధ్య 207 KM కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 2,911 కోట్లతో నిర్మించే ఈ మార్గం రాఘవాపూర్, మంథని, భూపాలపల్లి, మేడారం మీదుగా సాగనుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే 2 ప్రాంతాల మధ్య 90 KM దూరం తగ్గడమే కాకుండా, సింగరేణి బొగ్గు రవాణా వ్యయం భారీగా తగ్గనుంది.