KNR: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రేపు ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ కోరారు. అబాది జమ్మికుంట, వావిలాల, తనుగుల క్లస్టర్ రైతు వేదికలలో మధ్యాహ్నం 3 గంటలకు “రైతు నేస్తం” కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొనాలని సూచించారు.