వికారాబాద్ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. MPC, BiPC, CEC, MEC గ్రూపుల్లో తలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ బ్యూల తెలిపారు. 10వ తరగతి మార్కుల ఆధారంగానే విద్యార్థుల ఎంపిక ఉంటుందని, ఆసక్తి గల వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.