ADB: రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ లాభసాటి సాగు చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేయాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ అనూష, AMC ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.