NLG: రవాణా శాఖలో ‘వాహన్’ పోర్టల్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ మార్పు, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇకపై ఆన్లైన్లో సులభంగా పొందవచ్చు. కేంద్ర వ్యవస్థతో అనుసంధానం కావడంతో ఇతర రాష్ట్రాల వాహన బదిలీలు కూడా సులభతరం కానున్నాయి. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.