BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్సా రమేష్, ఉసికల వెంకటేశ్వర్లు, మల్కం వీరభద్రం ఆధ్వర్యంలో బుధవారం బయలుదేరారు. ఇందిరమ్మ లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరవుతున్నట్టు తెలిపారు.