SRCL: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో బీఆర్ఎస్వీ నాయకులు జిల్లా కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు.