కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉచిత గుర్తులను విడుదల చేసింది. మొత్తం 193 ఉచిత ఎన్నికల గుర్తులతో నూతన జాబితాను ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థులుగా, గుర్తింపు లేని పార్టీల తరఫున అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేసే వారు ఈ ఉచిత ఎన్నికల గుర్తుల జాబితాలోంచే తమకు నచ్చిన గుర్తును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ (December)లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ,వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు (General Elections) జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల గుర్తులను రిలీజ్ చేసింది. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో గాజులు, బేబీ వాకర్, వాలెట్, పుచ్చకాయ, వాక్యూం క్లీనర్, ట్రంపెట్, వాకింగ్ స్టిక్ (Assembly elections), ఏసీ, సూది, ఏసీ, లాగుడు బండి, వయొలిన్, కిటికీ, వాల్ నట్, విజిల్, వూల్ తదితర వస్తువులు ఉన్నాయి.ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది.