WGL: ప్రతీ బీజేపీ కార్యకర్త హృదయంలో వరంగల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ట్వీట్ చేశారు. ఓరుగల్లు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడికి నేతలు ఘన స్వాగతం పలికారు. 1984లో దేశ వ్యాప్తంగా పార్టీ కేవలం రెండు స్థానాలు గెలుచుకున్నప్పుడు, అందులో ఒక చారిత్రాత్మక విజయం వరంగల్ గడ్డపై జంగారెడ్డి రూపంలో నమోదైందని అన్నారు.