PDPL: నంది మేడారం పాక్స్ పర్సన్ ఇన్చార్జ్గా మాజీ అధ్యక్షుడు బలరాం రెడ్డి ఇవాళ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తిరిగి పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో మల్లేశం, డైరెక్టర్లు పాల్గొన్నారు.