MDK: కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో కలిసి 96 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.