ADB: వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం పట్టణంలోని భరోసా, షీ టీం కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, మహిళలకు అండగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా 100 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.