ADB: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించడానికి పట్టణానికి రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తెలియజేశారు.