SRPT: హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో ఈనెల 24న జరగబోయే సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఐదవ మహాసభలు విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నవీన్ తేజ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 24న మఠంపల్లిలో జరిగే సమాచార హక్కు రక్షణ చట్టం 5 మహాసభకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఆర్టీఐ కార్యకర్తలు పాల్గొనాలన్నారు.