MNCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కవ్వాల్ క్లస్టర్ పరిధిలోని పోనకల్లో రైతు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి బ్యాంక్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ అక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు.