BHNG: మోట కొండూరు మండల పరిధిలోని వర్టూరు చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. అనుమతులు ఉన్న వాహనాలకు, క్షేత్రస్థాయిలో నడుస్తున్న వాహనాల నంబర్లకు పొంతన లేకపోవడంతో సీఐ శంకర్ గౌడ్ ఈ చర్యలు తీసుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.