WNP: బాలల భద్రతను పర్యవేక్షించడం, వ్యసనాలకు అలవాటు పడ్డ వారిలో మార్పు తేవడం, నేటి యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుంచి పారదోలడమే ముఖ్య ఉద్దేశమని వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. మంగళవారం ప్రభుత్వం మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుందన్నారు.