ADB: విధి వెక్కిరించినా.. అతని సంకల్పం, పట్టుదల ముందు ఓటమి తలవంచింది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సాయిచరణ్ ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదం జరిగి రెండు చేతులు కోల్పోయాడు. ఆయన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 422 మార్కులు సాధించి అందరి మన్ననలు పొందాడు. ఈ మేరకు సాయిచరణ్‌ను MLA పాయల్ శంకర్ అభినందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.