GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం కాకులారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానున్న ఈ పాఠశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో 1500 మంది విద్యార్థులు చదువుకునేలా సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.