MHBD: నూతన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా గూడూరు మండల కేంద్రాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని DSFI ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లోఇవాళ నిరసన తెలిపారు. DSFI మండల ఇన్ఛార్జి బానోతు దేవేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గూడూరు మండలంలో అత్యధికంగా ఆదివాసి, గిరిజనులు, గిరిజనేతర ప్రజలు ఉన్నారని, దీనిని నియోజకవర్గం చేయాలని డిమాండ్ చేశారు.