HNK: హన్మకొండ నగరంలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం రావడంతో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అంబాల ప్రాంతంలో ఒక మహిళ వద్ద సుమారు రూ. 35,000 విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కేయూ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఎసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్ తెలిపారు.