NZB: మోపాల్ రైతు వేదికలో వార్డ్ మెంబర్స్ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో రాములు నాయక్ మాట్లాడుతూ.. ఐదు రోజులపాటు జరిగే శిక్షణ తరగతులు గ్రామ పంచాయతీకి వార్డ్ మెంబర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్డు సభ్యులు తమ విధులు, హక్కులు, గ్రామ అభివృద్ధిలో వారి పాత్రపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవడం ఈశిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు.