MHBD: వ్యవసాయ మార్కెట్ కు మొక్కజొన్న తీసుకువచ్చే రైతులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఈనెల 14(నేటి) నుంచి 19 వరకు మార్కెట్కు మొక్కజొన్న తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డు మొత్తం మక్కలతో నిండినందున, అలాగే స్థలం తక్కువగా ఉన్న నేపథ్యంలో మక్కల కొనుగోలు నిలిపి వేశామన్నారు. తిరిగి 20వ తేదీ సోమవారం మక్కల కొనుగోలు ప్రారంభమౌతాయన్నారు.