HYDలో ట్రాఫిక్ సిగ్నల్ ఆధునికీకరణకు GHMC చర్యలు ప్రారంభించింది. అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ వ్యవస్థ అమలుకు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగాన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌గా ఎంపిక చేసింది. రూ.2.99 కోట్లతో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనుంది. ప్రాజెక్టులో భాగంగా కొత్తగా 50 జంక్షన్లు, 15 పెలికాన్ సిగ్నళ్లు ఏర్పాటు చేయనున్నారు.