ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.