JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని అన్నారు. అనంతరం మండల స్థాయి ఉపాధ్యాయులను సన్మానించారు.