PDPL: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.