BDK: ఇల్లందు మండలం సుదిమళ్ళ గ్రామ రెవిన్యూ క్లస్టర్ రైతు వేదికలో రైతు వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ కిరణ్ మిత్ర, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొని మాట్లాడారు. పోడు రైతులంతా మొక్కజొన్న సాగు మాత్రమే కాకుండా ప్రత్నమాయ పంటల వైపు మారాలన్నారు. అయిల్ పామ్ పంట ఆదాయం, ఉత్పత్తిపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు.