MDCL: బక్రీద్ పండుగను శాంతియుతంగా, ఐకమత్యంతో జరుపుకోవాలని అల్వాల్ సీఐ ప్రశాంత్ సూచించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ.. ఉత్సవాల సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, మత పెద్దలు పాల్గొని శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.