NGKL: అచ్చంపేట మండలం నడింపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శనివారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఓ సంస్థ విరాళంగా ఇచ్చిన 20 సైకిళ్లను ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అర్జునయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.