MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన దాసోజు కళ్యాణి అనే 7 నెలల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా నెల్లికుదురు PHCకి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను రోడ్డు పక్కన ఆపి ఆమెకు 108 సిబ్బంది మల్లేష్, సుధాకర్ సాధారణ ప్రసవం చేశారు. కళ్యాణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.