BDK: అశ్వాపురం మండలం తహసీల్దార్‌కు ఆదివాసి సంఘం, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర మాట్లాడుతూ.. మండల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా 1/70 చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములలో, ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న గిరిజ నేతరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లు నాయకులు పాల్గొన్నారు.