HYD: నగరంలో రోడ్డు భద్రతకు ట్రాఫిక్ పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. గత 12 రోజుల్లో ఫ్రీ లెఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించిన 9,142 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం, జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ మార్గాలను బ్లాక్ చేయడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది.