KNR: భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్లో వినియోగించుకోగలరు.