HYD: సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్-2026 3వ రోజూ అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగింది. వివిధ జిల్లాలు, జోన్లు, కమిషనరేట్లు,స్పెషల్ ఫోర్సెస్ నుంచి తరలివచ్చిన వందలాది మంది పోలీస్ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యంతో మైదానాన్ని హోరెత్తించారు. వాలీబాల్, కబడ్డీ వంటి ప్రధాన విభాగాలలో గెలుపే లక్ష్యంగా పోటీపడ్డారు.