HYD: హుస్సేన్ సాగర్లో ఈరోజు ఉదయం తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని లేక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వెలికితీశారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.