SDPT: సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు మంగళవారం క్షేత్ర పర్యటన చేపట్టారు. వృత్తి విద్యా వ్యవసాయ శిక్షణలో భాగంగా ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి, శిక్షకురాలు మానస ఆధ్వర్యంలో స్థానిక నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా పూల, పండ్ల మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణ పద్ధతులపై యజమానిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.