BHPL: మొగుళ్లపల్లి మండలంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.11 గం.కు ఎంపీపీ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుదారులు తమ వెంట అసలు పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసిన అర్హుల జాబితాను జిల్లా అధికారులకు పంపిస్తామని వెల్లడించారు.