ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న కటింగ్లపై సీపీఎం నాయకులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రైస్ మిల్లర్లు క్వింటాలుకు 3–6 కిలోల వరకు కట్ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు రసీదులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.