GDWL: మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్లకు అత్యవసర మరమ్మతులు చేపడుతున్నందున గద్వాల, అయిజ పట్టణాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి బుధవారం రాత్రి వరకు ఈ అంతరాయం ఉంటుందని కార్యనిర్వాహక ఇంజనీర్ రవిచంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టేందుకు ఈ పనులు చేపడుతున్నామని, ప్రజలు సహకరించలన్నారు.