WGL: ఖిలా వరంగల్ మండలం దూపకుంట రోడ్డులో శుక్రవారం రాత్రి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ తెలిపారు. నమ్మదగిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 19,200 నగదు, ప్లేకార్డులు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.