ఆసిఫాబాద్ జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అన్ని విభాగాల అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.