MDK: హవేలీ ఘనపూర్ లో విద్యార్థులకు విద్యుత్ షాక్ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మెదక్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బట్టి జగపతి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.