MDK: హవేలి ఘనపూర్ మండలంలోని సర్ధన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం మధ్యాహ్నం లంచ్ విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగులో ఉన్న 5 విడతల డీఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.