WNP: స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం వెలటూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల H.Mలు విష్ణు, భాగ్యలక్ష్మి, పంచాయతీ సెక్రెటరీ వెంకటస్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.