WGL: వరంగల్ నగరంలో కరీమాబాద్‌లో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఇవాళ విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నిషేధిత ఓపియం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.