అంతర్జాతీయంగా 400+ వికెట్లు తీసిన ఆరో భారత పేస్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597) ముందున్నారు. అయితే బుమ్రా ఇదే ఫిట్నెస్ కొనసాగిస్తే భవిష్యత్తులో అన్ని రికార్డులు అధిగమిస్తాడని జహీర్ వ్యాఖ్యానించాడు. బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకమని.. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతనేనని అన్నాడు. 400+ వికెట్లు తీయడం సాధారణ విషయం కాదని.. బుమ్రా తన శరీరాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు.